Tuesday, December 29, 2009

సాంస్కృతిక కార్యక్రమాలు, గంతులూ, చిందులూ

1 Comments:

Blogger బొందలపాటి said...

రోహిణీ ప్రసాద్ గరూ,
చాలా చక్కగా చేయవలసినది ఏమిటో చెప్పారు. కొంత మంది ఒక విచిత్రమైన వాదనను లేవదీస్తారు.
"మన ముందు తరాల వారి కంటే వారి కంటే వారి ముందు తరాలవారి సంస్కృతి ఉన్నతం గా ఉండేది కదా. కాబట్టీ మనకి రెండు తరాలు ముందున్న వారి దృష్టి తో చూస్తే మన ముందు తరాల వారి సంస్కృతి నాసి రకం గా ఉంటుంది కదా? చిత్తూరు నాగయ్య గారి సినిమా ల తో పోలిస్తే రామా రావు గారి డ్రైవర్ రాముడు నాసి కదా!"
ఇదీ వారి వాదన. కానీ మన ముందు తరాల వారి కంటే మన సంస్కృతి ఎందుకు ఉన్నతం గా ఉండ కూడదు అని వీరు ఆలోచించరు. "సంస్కృతి పరిణామం చెందే దిశ ఎప్పుడూ పతనం వైపుకే ఎందుకు ఉండాలి ?" అని వీరు ఆలోచించరు.
నాది ఇక్కడ ఒక చిన్న సందేహం..ఒక మనిషి ఒక అసభ్యమైన సినిమా చూసి ఆనందిస్తున్నాడనుకొందాం..సినిమా తీసిన వాడూ బాగున్నాడు..చూస్తున్న వాడూ బాగున్నాడు..దీని వలన సిగరెట్ తాగటం లాగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు..మధ్య లో పక్కనున్న వాడికి మనకెందుకు..మనం ఆ చూసే వాడికి "చూడొద్దు, నువ్వు చెడిపోతున్నావు" అని చెబితే, వాడు "ఈ సినిమా చూడటం వలన నాకు నష్టం ఏమీ లేదు..నేను ఎంజాయ్ చేస్తున్నాను " అంటాడు. "నీకు ఇష్టమైన దానిని నన్ను చేయమని అడగవద్దు" అంటాడు.
"ఏ కొలబద్ద ప్రకారం నువ్వు చెప్పే విలువలు నేను ఎంజాయ్ చేసే విలువల కంటే గొప్పవి?" అని కూడా అడుగుతారు..మనం అన్ని సంస్కృతులకీ కాలాలకీ గీటు రాయి గా ఉండే ఒక కొలమానాన్ని (రస స్పందన, లాలిత్యం లాంటివి)సూచించగలిగినా, వాటిని క్వాంటిఫై చేయలేం. ఒక వేళ చేసినా వీళ్ళు "మేము వాటిని అంగీకరించము",అంటారు.
కాబట్టీ "చెప్పటం వలన ఏమైనా ఉపయోగం ఉందా?", అనేది నా సందేహం.

లిబరల్ వాల్యూస్ అనేవి ఉన్నత విలువలని అవతలి వారి మీద రుద్దటాన్ని వ్యతిరేకిస్తాయి. ఈ పరిస్థితులలో మన కుటుంబం వరకూ మనం సరిదిద్దుకోవాలి..కానీ ఇదీ సందేహాస్పదమే..ఒక రచయిత ప్రకటించేవిలువలను అతని భార్యే అనుసరించదు..అటువంటి కుటుంబం లో పుట్టిన పిల్లలు ఎంత వరకూ ఆ రచయిత విలువలను పాటిస్తారో ఊహించుకోవలసిందే.
ఇక నా స్వంత విషయానికి వస్తే,నేను ఈ మధ్య "ఒక తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కథ" అని ఒక నవల రాసి, ఇంటర్నెట్ లో బ్లాగు గా పెట్టాను. ఇదే నా మొదటి రచన.
సైట్ ఇక్కడ ఉంది:
http://wp.me/pGX4s-52
మీ నాన్న గారు కొత్త రచయితల రచనలను ఆసక్తి తో చూసే వారట. మీరు కూడా అలానే నా నవలను చదివి మీ అభిప్రాయం చెబుతారని ఆశిస్తున్నాను.

10:18 AM  

Post a Comment

<< Home