కొకు రచనాప్రపంచం 16 సంపుటాలు
Oct 28th 1909-Aug 17th 1980
కొడవటిగంటి కుటుంబరావు శతజయంతి సందర్భంగా 2009లో ఆయన రచనాసర్వస్వాన్ని ప్రచురించాలని విప్లవ రచయితల సంఘం నిర్ణయించుకున్నది. తెలుగునాట నిజమైన విప్లవ, ప్రజా సాహిత్యోద్యమాన్ని నిర్మించి విస్తరిస్తున్న విరసం గతంలో శ్రీశ్రీ, చెరబండరాజు సమగ్ర రచనలను, కుటుంబరావు వ్యాసప్రపంచాన్ని ప్రచురించింది. తెలుగు సమాజంలో విప్లవభావాలను వ్యాపింప జేయడంలో అసాధారణమైన కృషి చేసిన కుటుంబరావు వ్యాసాలను మాత్రమేకాక, కథలనూ నవలలనూ కూడ కలిపి రచనాప్రపంచం మొత్తాన్నీ ఆయన శతజయంతి కానుకగా పాఠకులకు అందించడానికి ఈ ప్రయత్నం.
కుటుంబరావు ఇరవై రెండో ఏట 1931లో తొలి కథ అచ్చయిన నాటినుంచి 1980 ఆగస్ట్ 17న మరణించేదాకా రచనే జీవితంగా గడిపారు. రాశిలోనూ వాసిలోనూ గణనీయమైన రచనలు చేసిన అతి కొద్దిమంది తెలుగు మేధావులలో కుటుంబరావు అగ్రగణ్యులు. ఆయన రచనాకృషి కథా, నవల, నాటిక, గల్పికవంటి సృజనాత్మక ప్రక్రియలలో నాలుగువేల పేజీలకుపైగా; శాస్త్రవిజ్ఞానం, రాజకీయాలు, సాహిత్యవిమర్శ, సినిమా, చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రంవంటి అనేక రంగాలపై వివరణాత్మక, విశ్లేష ణాత్మక వ్యాసాలు మరొక నాలుగువేల పేజీలకు పైగా విస్తరించి ఉంది.
కుటుంబరావు రచనలు గతంలో విడివిడిగా అనేకసార్లు, సమగ్ర సంపుటాలుగా ఒకసారి అచ్చయినప్పటికీ అవేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. అప్పటికి అలభ్యంగా మిగిలిపోయిన రచనలు కూడ కలిపి, ప్రణాళికాబద్ధంగా విభజించి శతజయంతి సందర్భంగా విరసం ప్రచురించబోతున్నది.
కొకు రచనా ప్రపంచం మొత్తం 16 సంపుటాలుగా ఒక్కొక్క సంపుటి 450 పేజీలకు తగ్గకుండా వెలువడుతుంది. ఈ సంపుటాలకు చలసాని ప్రసాద్, కృష్ణాబాయి కూర్పరులుగా ఉంటారు. కొకు రచనాజీవితం కథలతో ప్రారంభమైంది గనుక కథలు అచ్చయిన కాలక్రమానుగతంగా మొదటి ఐదు సంపుటాలలో వస్తాయి. ఆ తరవాతి మూడు సంపుటాలలో నవలలు, ఒక సంపుటంలో నాటికలు, గల్పికలు, ఇతర రచనలు వస్తాయి. ఆ తరవాతి ఏడు సంపుటాలలో సైన్స్ వ్యాసాలు, చరిత్ర సంస్కృతి వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు, సాహిత్యవ్యాసాలు, సినిమా వ్యాసాలు, తాత్విక వ్యాసాలు, లేఖలు వెలువడుతాయి.
కొకు రచనాప్రపంచం తొలి నాలుగు సంపుటాలు 2009 జనవరిలో తెనాలిలో జరుగనున్న విరసం సాహిత్య పాఠశాల (కొడవటిగంటి కుటుంబరావు శతజయంతి పాఠశాల)నాటికి వెలువడతాయి. ఆ తర్వాత ప్రతి నాలుగు నెలలకు నాలుగు సంపుటాల చొప్పున ఆ సంవత్సరం పొడవునా అన్ని సంపుటాలు వెలువడతాయి.
ఈ పదహారు సంపుటాల కుటుంబరావు రచనాప్రపంచం ప్రణాళికలో భాగం పంచుకోవలసిందిగా కుటుంబరావు అభిమానులకు, సాహిత్యాభిమానులకు విరసం విజ్ఞప్తి చేస్తోంది. ప్రవాసాంధ్ర సాహితీమిత్రుల సూచనల మేరకు సంపుటాల వెల, రవాణా ఖర్చులు, విరాళం కలిపి ఒక్కొక్క సెట్‌కి $ 200 గా నిర్ణయించడం జరిగింది. (నాలుగు విడతలుగా అందే సంపుటాలకు రవాణా ఖర్చు $ 50 పైనే ఉంటుందని అంచనా.) అమెరికాలో కొకు రచనాప్రపంచం సెట్ కొనుక్కోదలచినవారు జనవరి 1, 2009లోపు డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ బాధ్యులు శ్రీ ఆరి సీతారామయ్య (ari@oakland.edu), శ్రీ మద్దిపాటి కృష్ణారావు (maddipati@wayne.edu) లను సంప్రదించవచ్చు.